చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు

, అమరావతి: సంప్రదాయేతర ఇంధన కంపెనీలు అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టుకు వెళ్లబోతున్నాయని, ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ముప్పులాంటిదంటూ వచ్చిన కథనాలు దుష్ప్రచారమేనని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క కంపెనీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల నుంచి విద్యుత్‌ కొనుగోలును నిలిపివేయలేదని వెల్లడించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు నిర్దేశించిన విధంగా ఈఆర్‌సీ ఇ‍చ్చే నిర్ణయాలను అమలు చేస్తూ చట్టప్రకారం ముందుకు సాగుతాం. ప్రభుత్వం కేవలం సంప్రదాయేతర ఇంధనాన్ని సమకూర్చే సంస్థలకే కాదు.